Description - Nemali Kannulu (Autobiography of Prof.Darla, Part-1) (Telugu) by Dr Darla Venkateswara Rao
వర్తమాన తెలుగు రచయితల్లో ఆచార్య 'దార్ల' వెంకటేశ్వర రావు తనదైన సాహితీ వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. వారు అనేక సాహితీ ప్రక్రియలను స్పృశిస్తూ, తనదైన ముద్రను నిలుపుకుంటున్నారు.దార్ల వ్యక్తిగతంగా స్నేహశీలి, ఆత్మీయులు, పరోపకారి, శక్తివంచన లేకుండా అందరికీ సహాయపడతారు. నాకు వారితో సాహితీ సంబంధమేకాక, వ్యక్తిగత స్నేహబంధాలు కూడా విస్తృతంగా, బలీయంగా ఉన్నాయి. వీటికి ఇది సందర్భం కాదు. దార్ల గతంలో తన ఆత్మకథను చదివి భాషాపరమైన సూచనలు ఇవ్వమని నన్ను కోరారు. వారికి నా పట్లగల నమ్మకానికి కృతజ్ఞతలు. నాకు తోచిన, సమంజసమనిపించిన సలహాలను తెలిపాను. 'అందులో కొన్నిటిని తీసుకున్నాను.' అని వారు అన్నారు. ముగించాను. అంత మాత్రాన సంపాదకుడనడం సమంజసమా!?కావ్యం ఉపదేశం, ఆనందం ఇవ్వాలని లాక్షణికుల ఆభిప్రాయం. ఈ రెండు అంశాలు దార్ల నెమలి కన్నలులో ఉన్నాయి. "నెమలి కన్నులు"లో 37 విభాగాలు లేదా అధ్యాయాలున్నాయి. ఇవి తన జీవన కాలంలోని సమాజానికి అద్దం పడుతుంది.
Buy Nemali Kannulu (Autobiography of Prof.Darla, Part-1) (Telugu) by Dr Darla Venkateswara Rao from Australia's Online Independent Bookstore, BooksDirect.
A Preview for this title is currently not available.